ప్రభాస్, నాగ అశ్విన్ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్న ప్రభాస్
ప్రభాస్, నాగ అశ్విన్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో తెరకెక్కించబోతోంది. దాదాపు 250 కోట్లతో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదో సైన్స్ ఫిక్షన్ అని, జాన పద కథ అని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ గారు ఏ సినిమా చేసినా అది ఒక పిచ్చి క్రేజ్ గా వారి అభిమానులు భావిస్తూ ఉంటారు. వర్షం లాంటి లవర్బాయ్ క్యారెక్టర్ చేసిన బాహుబలిలో లాంటి హీరోయిన్ క్యారెక్టర్ చేసిన కూడా దీనిని కూడా ప్రభాస్ లో చూసుకోవడం అభిమానానికి నిదర్శనం. ప్రభాస్ తనకు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చిన తనదైన శైలీ లో అందరి అభిమానులను ఎంత గానో అలరిస్తాడు. ప్రభాస్ తను నటించిన ప్రతి ఒక్క సినిమాలో వైవీధ్యాలను ప్రేక్షకుల ముందుకు తెస్తారు
తను తీయబోయే సినిమా ప్రతి ఒకటి, భారీ అంచనాలతో ముందుకు వచ్చి అంతకన్నా మించిన అంచనాలతో విజయాలను పొందుతారు మన ప్రభాస్. తను నటించబోయే సినిమాలో తన యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని అభిమానులు ఎప్పటికప్పుడు ఎక్సైట్ మెంట్ తో వెయిట్ చేస్తూనే ఉంటారు. అలాంటి సందర్భాల్లో కొన్ని క్యారెక్టర్ కి సంబంధించిన విషయాలు బయటికి వచ్చినప్పుడు తన అభిమానులు ఎంతగానో రియాక్ట్ అవుతారు. అలాంటి ఒక విషయమే నేడు ఒకటి బయటకు వచ్చింది. అది ఏంటి అంటే తాజాగా ప్రభాస్ నటించబోయే సినిమాలో నాగ అశ్విన్ గారితో నటించబోతున్నారని తెలిసిందే అయితే
ఇప్పుడు మరో ఆసక్తి కరమైన విషయం బయటకు వచ్చింది. ఈచిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఒకేసారి రెండు విభిన్నమైన కాలాలలో జరిగే కథ ఇదని, ఆ రెండు పాత్రలూ పురాణ పురుషుల్ని పోలి ఉంటాయని, రెండు పాత్రల్లోనూ ప్రభాస్ కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ రెండు కథల్ని, రెండు పాత్రల్నీ నాగ అశ్విన్ ఎలా కలిపాడన్నది ఆసక్తిగా ఉంటుందట. ఈ సినిమా కోసం భారీ సెట్స్ అవసరం. వాటికి సంబంధించిన కసరత్తులు ఇప్పుడు మొదలయ్యాయి. ఈనెలాఖరున షూటింగ్ మొదలుకావల్సివుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యం కాకపోవొచ్చు. ఈ చిత్రాన్ని ఇదే నెలలో లాంఛనంగా మొదలెట్టి, అక్టోబరులో కొన్ని సన్నివేశాల్ని తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అది కూడా పరిస్థితులు అనుకూలిస్తేనే. లేదంటే 2021 ప్రధమార్థంలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుంది.
ఈ అనివార్య కారణాల వల్ల తమను అభిమానించే అభిమానుల ముందుకు రాలేకపోతున్నారు ప్రముఖ హీరోలు ఎంతగానో బాధ పడుతున్నారు. సంవత్సరానికి ఒకటి ఈ సినిమా రెండు సినిమాలు చేసే రోజుల్లో కూడా ఆ మాత్రం కూడా చేయలేకపోతున్నందుకు వారు చాలా చింతిస్తున్నాం అని ప్రముఖ నటులు తెలియజేశారు. ఇటువంటి పరిస్థితులు ఏర్పడడం అన్నది. మన ఆర్థిక పరిస్థితి లోపించడానికి అని క్లియర్ గా అర్ధం అవుతుంది. ఈ ఆర్ధిక మాంద్యంలో నొప్పించడం అన్నది దీని వల్లనే అని మనకు తెలుస్తున్నది. ఇటువంటి పరిస్థితులు చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడూ రాలేదని ఇకమీదట రాకూడదు అని కోరుకుంటున్నారు ప్రజలు..
Post a Comment