బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ డార్లింగ్ ప్రభాస్


డార్లింగ్ ప్రభాస్ క‌టౌట్‌కి తగ్గ హీరోయిన్ వచ్చేసింది. ప్రభాస్ 21వ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ ఎంపికైంది. హీరోయిన్ కాన్ఫమ్ అయిందని వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. టాలీవుడ్లో వైజయంతీ మూవీస్ ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలను తెరకెక్కించింది. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవితో తెరకెక్కించిన ‘జగదీక వీరుడు.. అతిలోక సుందరి’ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.వైజయంతి మూవీస్ 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ‘జగదీకవీరుడు.. అతిలోక సుందరి’ లాంటి ఓ ఫాంటసీ మూవీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేశాడు. 500కోట్ల భారీ బడ్జెట్ తో డార్లింగ్ ప్రభాస్ తో ఫ్యాన్ ఇండియాను మూవీని తెరకెక్కించున్నట్లు నాగ్ అశ్విన్ గతంలోనే ప్రకటించాడు. ఈమేరకు సైంటిఫిక్ కథాంశంతో నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ ను ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ విషయంలో పలురకాల పేర్లు చక్కర్లు కొట్టాయి.
కొద్దిరోజులుగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ డార్లింగ్ ప్రభాస్ సరసన నటిస్తుందని ప్రచారం జరిగింది. చివరకు ప్రభాస్ జోడీగా దీపికా పదుకోనే కన్ఫామ్ కావడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. వైయంతీ మూవీస్ హీరోయిన్ పేరును అధికారికంగా ప్రకటించడంతో డార్లింగ్ ప్రభాస్ తన ఇన్ స్ట్రాగ్రామ్లో స్పందించారు. దీపికాతో పనిచేసేందుకు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నానని తనను వెల్ కమ్ చేస్తూ పోస్టు పెట్టాడు.