బాలకృష్ణ గారు నాకు డాన్సు నేర్పించారు : బాలివుడ్ హీరోయిన్ కత్రిన కైఫ్


నందమూరి బాలకృష్ణ వెండితెరపై ఎంత ఎనర్జిగా కనిపిస్తారో రియల్ లైఫ్ లో కూడా అంతే చలాకీగా ఉంటారని అందరికి తెలిసిన విషయమే. ఇక హీరోయిన్స్ ఒక్కసారి ఆయనతో నటిస్తే చాలు ఆ అనుభవాన్ని వారు ఎన్నటికీ మరచిపోలేరు. అందుకు ఉదాహరణగా నిలిచాయి కత్రినా కైఫ్ మాటలు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కత్రినా 15 ఏళ్ల క్రితం బాలయ్య చేసిన సహాయం గురించి మాట్లాడింది అంటే ఆయన ఎలాంటి వారో చెప్పవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో బాలయ్యకు ఎంత మంచి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారితో నటించిన నటీనటులు వారి గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు. బాలయ్య వారి తండ్రి అయిన నందమూరి తారక రామరావు గారి దగ్గరినుండి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు అని ప్రత్యేకించి గుర్తు చేయనక్కర్లేదు అనుకుంటా. ఎవరు ఏమన్నా ఎవరు ఏమనుకున్నా కూడా బాల ఏది తన నటనలో ఒక ప్రత్యేక స్థానం అని చెప్పవచ్చు. బాలయ్య గారికి ప్రేమ తో పాటు కోపం కూడా ఎక్కువే అని చెప్పాలి ఎందుకంటే అతను అంతకు ముందు కాలంలో సోషల్ మీడియాలో ఒక ఫ్యాన్ని కొట్టినట్లుగా కూడా చూపించారు ఆ కొందరు టీవీ చానల్స్, అది ఏ సందర్భంలో జరిగింది పక్కన పెడితే టీవీ చానల్స్ మాత్రం ఆ టాపిక్ ని హైలెట్ చేశారు. ఇంతకీ కత్రినాకైఫ్కి బాలయ్య వారికి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది అన్నది మన గురించి మనం మాట్లాడుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం కత్రినాకైఫ్ గారు తెలుగులో నటించడం జరిగింది. విక్టరీ వెంకటేష్ తో మల్లేశ్వరి అనే చిత్రంలో నటించి మంచి గుర్తింపు పొందారు కత్రినాకైఫ్. అలాగే తనకు మంచి గుర్తింపు రావడం వలన మరి కొన్ని చిత్రాలు తెలుగులో చేయడానికి ఇష్టపడ్డారు ఆవిడ. ఆ చిత్రం తర్వాత చాలా అవకాశాలు వారికి వచ్చాయి. కానీ కత్రినా కైఫ్ మాత్రం బాలయ్య సినిమా కి మాత్రమే ఒప్పుకోవడం జరిగింది. అలా బాలయ్య గారు నటించిన అల్లరి పిడుగు సినిమా కి మరియొక హీరోయిన్ గా సెలక్ట్ అయ్యారు. అయితే తన కెరీర్ స్టార్టింగ్ లో తనకు అంతగా పెద్దగా డాన్స్ రాకపోవడం తన మైనస్ గా ఉండేది. ముందుగా కొందరు దర్శకనిర్మాతలు కత్రినాకైఫ్కి డాన్స్ రాదు అని నిరాకరించడం కూడా జరిగిందంట. అయితే బాలకృష్ణ గారి తో నటిస్తున్న టైం లో బాలకృష్ణ గారు ఎలా డాన్స్ చేయాలి ఎలా కెమెరా ఫేస్ చేయాలి అనే వాటిపైన కొంత వరకు చెప్పారంట, ఆ చిట్కాలను పాటించడం వలన కత్రినాకైఫ గారికి చాలా తొందరగా డాన్స్ నేర్చుకోవడం జరిగిందంట. ఇప్పుడు కత్రినా కైఫ్ గారు ఎలా డాన్స్ చేస్తారు మనకందరికీ తెలిసిన విషయమే ఆమె బాలీవుడ్లో డాన్సర్గా కూడా గుర్తింపు పొందారు, ఎంతో చక్కటి తన నృత్యంతో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు.